
సాంకేతిక కారణాల వల్ల ఆస్ట్రేలియా వీసా లభించకపోవడంతో ఆ దేశంలో జరగాల్సిన కార్యక్రమానికి నటుడు మోహన్‌లాల్ హాజరు కాలేకపోయారు.
తన వల్ల కార్యక్రమం ఆలస్యమైనందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే అదే బృందంతో తిరిగి వస్తానని ఆయన వీడియో సందేశం ఇచ్చారు.
మోహన్‌లాల్ బృందంలోని కేఎస్ చిత్ర తదితరులు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.