
అమెరికాలోని కాలిఫోర్నియా మాంటెరీ కౌంటీలోని మాస్ ల్యాండింగ్ స్టేట్ బీచ్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న కాల్పుల్లో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
ఘటన తర్వాత కాలిఫోర్నియా స్టేట్ పార్క్స్ పోలీసులు జెట్టీ రోడ్‌తో పాటు మాస్ ల్యాండింగ్ స్టేట్ బీచ్‌ను మూసివేసి రాకపోకలను నిలిపివేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం మాస్ ల్యాండింగ్ కమ్యూనిటీకి ఎలాంటి తక్షణ ప్రమాదం లేదని మాంటెరీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.