
దక్షిణాఫ్రికాతో డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా తలపడింది.
తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా తుదిజట్టులోని పదకొండు మంది ఆటగాళ్లూ ముప్పై ఏళ్లకు పైబడిన వారే బరిలోకి దిగారు.
ఇలా అందరూ వెటరన్ ఆటగాళ్లతో ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐదోసారి మాత్రమే కావడం విశేషం.