
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ బంగ్లా' మూడో సీజన్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ షో స్టార్ జల్సా ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం కానుండగా, ఆగస్టు 31 నుంచి ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు ఎపిసోడ్లు రానున్నాయి.
ఈ సీజన్లో సుమారు 15 మంది కంటెస్టెంట్లు పాల్గొననుండగా, హిందీతో సహా ఆరు ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ ఫ్రాంచైజీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.