
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 2.5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రక్రియను ప్రారంభించింది.
ప్రతి షేరు కనీస ధరను రూ.382గా నిర్ణయించగా, డిమాండ్‌ను బట్టి గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా అదనంగా 4 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి ఎల్‌ఐసీలో 96.5 శాతం వాటా ఉండగా, గ్రీన్ షూ ఆప్షన్ పూర్తిగా వినియోగిస్తే మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే వెసులుబాటు ఉంది.