
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిజాంసాగర్ మరియు జూరాల ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గత 24 గంటల్లో 6,585 క్యూసెక్కుల నీరు చేరగా, జూరాల ప్రాజెక్టుకు 27,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.
వరద ప్రవాహం నేపథ్యంలో జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 10 యూనిట్ల ద్వారా 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు.