
వైఎస్సార్ తనయురాలు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తన అన్న జగన్‌తో రాజీకొచ్చారని, త్వరలో వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని వస్తున్న వార్తలను ఖండించారు.
తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలని, జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని షర్మిల ట్వీట్ చేశారు.
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని చివరిసారిగా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించినప్పుడు కలిశానని, ఇప్పుడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే కలుస్తానని షర్మిల స్పష్టం చేశారు.