కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో ఉన్న నానక్‌సర్ గురుద్వారాలో శుక్రవారం ఉదయం 5.05 గంటలకు జరిగిన దాడిలో 75 ఏళ్లు, 51 ఏళ్ల వయస్సు గల ఇద్దరు భక్తులు గాయపడ్డారు.
దాడికి పాల్పడిన 27 ఏళ్ల నిందితుడు ఆగస్టు 20న ఫెడరల్ జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
నిందితుడు గురుద్వారాలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకోవడంతో స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడని, ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.