
ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో గాయం పేరుతో జట్టును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయంలో గాయపడినట్లు చెప్పి రెండు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేయని ఇమామ్, నాలుగో రోజు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు చిక్కడంతో వివాదం మొదలైంది.
ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయనుండగా, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ క్రమశిక్షణపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.