
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమైనప్పటికీ, బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉదయం 5.10 గంటలకు ప్రారంభం కావాల్సిన బస్సులు గంటల తరబడి ఆలస్యంగా రావడంతో, ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ట్యాక్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో నిత్యం 32 సర్వీసుల ద్వారా 9 వేల మంది ప్రయాణించేవారని, భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో పాత విమానాశ్రయం నిర్మానుష్యంగా మారిందని అధికారులు తెలిపారు.