కామారెడ్డి జిల్లా జుక్కల్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
స్థానిక ఎమ్మెల్యే తోట ప్రమాద స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.