
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 877.70 అడుగులకు చేరుకోగా, జూరాల ప్రాజెక్టులో 7.297 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వరద ఇదే స్థాయిలో మరో 3-4 రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని, నాగార్జునసాగర్‌కు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.