
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మానవ ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు హ్యూమనాయిడ్ రోబోల సాయంతో శారీరక శ్రమ పనులు కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఈ వ్యాఖ్యల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు 60,000 మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) అవకాశం కల్పించినట్లు వార్తలు వచ్చాయి.