
‘M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’లో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రూ.9.23 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబం రూ.8.63 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
అదానీ సంపద ఏడాదిలో 13 శాతం పెరగగా, అంబానీ కుటుంబ సంపద 10 శాతం తగ్గింది, వీరి మధ్య వ్యత్యాసం సుమారు రూ.59,400 కోట్లుగా ఉంది.