
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గొల్లపాలెం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆధిపత్య పోరు కారణంగానే ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.