
పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిదా కటెథాంగ్‌పై 21-14, 8-21, 23-21 తేడాతో గంటా నాలుగు నిమిషాల పోరులో సింధు విజయం సాధించింది.
మరో మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి ఉన్నతి హూడా జపాన్ షట్లర్ రికో గుంజీ చేతిలో పరాజయం చవిచూసింది.