
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పండగ సేల్స్ సందర్భంగా ప్రకటించే భారీ డిస్కౌంట్లు, ఆఫర్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు వాడే కొన్ని ప్రకటనలు మోసపూరితంగా మారుతున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఫెస్టివ్ సేల్స్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు వినియోగదారులు నకిలీ డిస్కౌంట్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.