
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 92.04 టీఎంసీలకు చేరుకోగా, ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులను దాటింది.
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, ఏపీ ప్రభుత్వం హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయలేదు.
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,25,855 క్యూసెక్కుల వరద చేరుతుండటంతో, దిగువకు 1,28,417 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.