
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు బుధవారం ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
2007 నుంచి 2018 మధ్య వివిధ స్కీముల పేరుతో ప్రజల నుంచి రూ. 3,041 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
విజయప్రసాద్పై ఐపీసీ 406, 120-B సెక్షన్లతో పాటు BUDS చట్టం కింద కేసులు నమోదయ్యాయని, డైరెక్టర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.