
రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది.
తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, రవితేజ కుమార్తె పాత్రలో బాలనటి నక్షత్ర నటించింది.