
ఆగస్టు నెల ప్రారంభం నుంచి వెండి ధరలు 20 శాతానికి పైగా పెరిగి, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 69.71 డాలర్ల గరిష్టాన్ని తాకింది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర రూ. 2,44,000 వద్ద రికార్డు స్థాయికి చేరుకుందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, పారిశ్రామికంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.