
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో ప్రపంచరికార్డును సమం చేసిన చికిత, జ్యోతి సురేఖ, ప్రతీక బృందాన్ని ప్రధాని కొనియాడారు.
భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ భారత జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.