
డీల్ నిర్వహించిన సర్వే ప్రకారం, 77 శాతం భారత కంపెనీలు రాబోయే 12-18 నెలల్లో విదేశీ రిక్రూట్‌మెంట్లను పెంచాలని ప్లాన్ చేస్తున్నాయి.
విదేశీ నియామకాల్లో నార్త్ అమెరికా 36 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, యూరప్/యూకే 27 శాతం, ఏపీఏసీ 21 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
89 శాతం కంపెనీలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, AI/ML నిపుణుల కోసం విదేశీ మార్కెట్లపై ఆధారపడుతున్నాయని, అయితే కంప్లయెన్స్ సమస్యలు విస్తరణను నెమ్మదిస్తున్నాయని సర్వే తెలిపింది.