
ఇండోనేషియాలోని బాలి సమీపంలో పడాంగ్ బాయి నుంచి లెంబార్ పోర్టుకు వెళ్తున్న ఫెర్రీలో అగ్నిప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ప్రమాద సమయంలో ఫెర్రీలో 131 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా, ఇప్పటివరకు 106 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు.
ఓడలో 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు ఉన్నాయని, సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించామని అధికారులు తెలిపారు.