ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరును నమోదు చేయడానికి సీట్లలో ఆటోమేటిక్ కెమెరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని, బయట సంతకాలు పెట్టి వెళ్లే పద్ధతికి స్వస్తి పలికారు.
సభకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలను నిలిపివేసేలా చట్టం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు స్పీకర్ వెల్లడించారు.