
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ మాత్రలు వికటించి జమున (7) అనే బాలిక మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు.
గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేయగా, ప్రస్తుతం 29 మంది భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో, 24 మంది లక్ష్మీపురం పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు కాకినాడ, విజయవాడ, రాజమండ్రి నుండి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు.