
నమీబియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వీస్ 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు.
కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇతను ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వీస్, ప్రస్తుతం వివిధ టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రమే ఆడుతున్నాడు.