
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో (2026–27, క్యూ1) రూ. 5,455 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించి, గతేడాది కంటే 34 శాతం వృద్ధి సాధించింది.
క్యూ1లో ఎంఅండ్ఎం మొత్తం ఆదాయం 28 శాతం వృద్ధితో రూ. 58,188 కోట్లకు చేరగా, 23% వృద్ధితో 3,04,000 వాహనాలను విక్రయించింది, ఇందులో 1,75,000 ఎస్యూవీలు ఉన్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సప్లయర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం కారణంగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లాభం రూ. 889 కోట్లకు పరిమితమై, గత ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గింది.