
ముంబయి-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా సాగుతుండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనులు ఇంతలా ఆలస్యం కావడం సిగ్గుచేటని పేర్కొన్న గడ్కరీ, ఈ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని స్పష్టం చేశారు.
ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు జాప్యంపై కేంద్ర మంత్రి బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.