
దేశంలోని యువత శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు, భాజపా గూండాలు వారిపై దాడి చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
పార్టీలు, వర్గాలకతీతంగా సోమవారం యువత, ప్రతిపక్ష పార్టీలు, పౌర సంఘాలతో కలిసి సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తామని ఆయన తెలిపారు.
ఓట్ చోరీని అంతం చేయాలని, సర్ ను నిలిపివేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం సమర్పిస్తామని వివరించారు.