
భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వర్షం తగ్గినప్పటికీ మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమై, అంపైర్లు మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు.
ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.