
ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో లండన్ స్పిరిట్‌పై సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు 37 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లు ర్యాన్ రికెల్టన్ (94 నాటౌట్), మిచెల్ మార్ష్ (76), హ్యారీ బ్రూక్ (55) మెరుపులతో నిర్ణీత 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు సాధించారు.
లండన్ స్పిరిట్ జట్టు డేవిడ్ విల్లీ (83) పోరాడినా, నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.