
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అక్కడి అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది.
నటాంజ్ అణు కేంద్రం సమీపంలోని పికాక్స్ మౌంటైన్ ప్రాంతంపై దాడి చేసే అవకాశాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
అయితే అయోడిన్ మాత్రల పంపిణీకి సంబంధించి వస్తున్న వార్తలను ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది.