పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పీటీఐ పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్, పెట్రోలియం పన్ను పెంపుపై జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనలతో దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ నిరసనల వల్ల రోడ్ల దిగ్బంధం కారణంగా రోజుకు సుమారు 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,833 కోట్లు) నష్టం వాటిల్లుతోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం సేవా రంగం 86 బిలియన్లు, పారిశ్రామిక రంగం 25 బిలియన్లు, వ్యవసాయ రంగం 9 బిలియన్ రూపాయల చొప్పున ఆర్థిక నష్టాన్ని చవిచూడనున్నాయి.