
హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి మరణించింది.
ఈ ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారును జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజుష్ (21) నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు సంజుష్పై మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.