
థాయ్లాండ్ రాజకీయాల్లో 60 డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన క్యాషియో AE1200WHD చేతి గడియారం హవా నడుస్తోంది.
ఆ దేశ ప్రధానమంత్రి అనుతిన్ నుంచి కేబినెట్ మంత్రుల వరకు అందరూ ఇష్టంగా ఈ వాచ్ను ధరిస్తున్నారు.
ఈ రెట్రో వాచ్లో ఉన్న ప్రపంచపటాన్ని నాయకులు అధికారానికి చిహ్నంగా భావిస్తున్నారు.