
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని అమెరికా తన పౌరులను ఆదేశించింది.
ఇరాన్లో ఇప్పటికే ఉన్న అమెరికన్లు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని భద్రతా హెచ్చరికలో సూచించింది.
విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలం మూసివేయడం వంటి పరిణామాలు ఎదురుకావచ్చని అమెరికా స్పష్టం చేసింది.