
ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి తనయుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ మరియు 'బలగం' నటి కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు.
తాము రిలేషన్లో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జంట అధికారికంగా వెల్లడించింది.
ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.