
వివిధ నియామకాల సిలబస్ మార్పులపై అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన విడుదల చేసింది.
సిలబస్ మార్పులపై అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కమిషన్ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది.
భారీ మార్పులుంటే కనీసం ఏడాది ముందుగా, స్వల్ప మార్పులైతే నోటిఫికేషన్తో పాటు కొత్త సిలబస్ ఇస్తామని తెలిపింది.