
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో జడ్జిగా వ్యవహరిస్తున్న బిందు మాధవి, గతంలో నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
బిందు మాధవి తనను 'అలాంటి వాళ్లు' అని సంబోధించడంపై నటరాజ్ మాస్టర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట జాగ్రత్త అని హెచ్చరించారు.
గతంలో బిగ్ బాస్ ఓటీటీలో జరిగిన గొడవలు ముగిసిపోయాయని, ఇప్పుడు తనను హైలైట్ చేసుకునేందుకు ఇతరులను కించపరచడం సరికాదని ఆయన కౌంటర్ ఇచ్చారు.