
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనలో, బిల్డర్ సాజిద్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేవలం 38 గజాల స్థలంలో అక్రమంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇలాంటి ప్రమాదకర భవనాలన్నింటినీ కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు.