
సిరియాలో 14 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నేరాలకు పాల్పడినందుకు మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు డమాస్కస్ కోర్టు మరణశిక్ష విధించింది.
ప్రస్తుతం రష్యాలో తలదాచుకుంటున్న అసద్, ఆయన సోదరుడు మాహెర్ అసద్‌ల గైర్హాజరీలోనే డమాస్కస్‌లోని నాల్గో క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి ఫఖ్రెద్దీన్ అల్-ఆరియాన్ ఈ తీర్పును చదివి వినిపించారు.
ఈ కేసులో పట్టుబడిన మాజీ సైనిక అధికారి ఆతెఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించగా, 5 లక్షల మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఈ అంతర్యుద్ధ బాధితులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.