
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి(52) తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు.
మంగళవారం రాత్రి 7.30 నుండి 8.30 గంటల మధ్య దుండగులు ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
హత్య జరిగిన ఇంట్లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో, పక్కా రెక్కీ నిర్వహించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని డీఎస్పీ శ్రీనివాస్‌రావు అనుమానం వ్యక్తం చేశారు.