
గ్రీన్ యాపిల్స్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా, శరీర కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, కడుపు నిండిన అనుభూతిని కలిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
తక్కువ కేలరీలు కలిగిన గ్రీన్ యాపిల్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.