
పల్నాడు జిల్లా నకరికల్లు జడ్పీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి నాగోతు లక్ష్మీవెంకట సరోజ 32,919 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ఏకంగా 93.65 శాతం ఓటు షేర్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా సాధించిన ఈ భారీ విజయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.