
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వరుస గాయాలతో ఇబ్బంది పడుతుండటం జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ స్థాయి బ్యాటర్లను తన స్వింగర్లు, యార్కర్లతో హడలెత్తించే బుమ్రా, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పలు కీలక సిరీస్‌లు, టోర్నమెంట్లకు దూరమయ్యాడు.
బుమ్రా వంటి కీలక బౌలర్ అందుబాటులో లేకపోవడం టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపుతోందని విశ్లేషణలు వస్తున్నాయి.