
నేపాల్లోని నారాయణి నదిలో కొట్టుకువచ్చిన వరద బాధితురాలి మృతదేహం నుంచి బంగారు కమ్మలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా గుర్తించామని, వీరిని పోఖారా బస్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నామని చిట్వాన్ పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని జుట్టుతో లాగుతూ అమానవీయంగా ప్రవర్తించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.