
అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ బౌన్సర్ల నుంచి పోలీసులు రెండు తుపాకులు, లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
జిన్నా షరీఫ్, ఆయన కొడుకు సహా మొత్తం 15 మందిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. బౌన్సర్లు పంజాబ్కు చెందినవారని టీడీపీ ఆరోపించింది.
ఎన్నికల్లో హింస సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ అభ్యర్థి కుట్ర పన్నారని టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.