
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అమరావతి నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేశారని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలను సురక్షితంగా తరలించారని ఆయన ప్రశంసించారు.
కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారికి త్వరలో అవార్డులు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు.