
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువును పెంచాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నామినేషన్ల సమయం ముగిసినందున ఎన్నికల్లో పోటీచేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ ఫుటేజ్‌ను భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీలకు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వట్లేదని వైసీపీ తరపు న్యాయవాది తెలిపారు.
ఈ ఎన్నికలపై వైసీపీ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను పాటించామని ఏపీ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.